PMO officials take initiative to train staff for mobile banking and cashless transactions
PMO officials demonstrate process of cashless transactions, help staff download the relevant mobile apps on mobile phones

నగదు రహిత లావాదేవీలను పెంచాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) లోని సీనియర్ అధికారులు ఈ రోజు ఒక విశిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు.

నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాన మంత్రి కార్యాలయం సిబ్బందికి ఇ-వాలెట్స్, యుపిఐ తదితర మొబైల్ అప్లికేషన్స్ ద్వారా రోజువారీ లావాదేవీలను నిర్వహించుకోవడం మరియు మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియల పట్ల అవగాహనను కలిగించడం, శిక్షణ ఇవ్వడం కోసం ఒక వర్క్ షాప్ ను వారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నృపేంద్ర మిశ్రా, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పి.కె. మిశ్రా లతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

నగదు లేకుండా లావాదేవీలను జరిపే విధానం గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. అంతేకాకుండా వారి సిబ్బంది తమ తమ ఫోన్ లలో సంబంధిత మొబైల్ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి కూడా అధికారులు తోడ్పడ్డారు.

స్మార్ట్ బ్యాంకింగ్ మరియు ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ దిశగా మళ్ళేందుకు అక్కడి వారు ఉత్సాహంగా వర్క్ షాప్ నకు తరలి వచ్చారు; ఈ విషయాలలో వారు ఎంతో ఆసక్తిని కనబరిచారు.

ఎస్ బి ఐ, MyGov లకు చెందిన అధికారులు కూడా ఈ కార్య్రక్రమంలో పాలుపంచుకున్నారు.