పాట్నాలోని మహాత్మా గాంధీ మైదాన్ వద్ద బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి శ్రీ నరేంద్ర మోదీ, ఒక ర్యాలీలో ప్రసంగించడానికి కేవలం కొన్ని క్షణాల ముందు భీకరమైన మరియు దురదృష్టకర బాంబు పేలుళ్ళు జరగకపోయి ఉంటే 27 అక్టోబర్ 2013 కూడా మరో ఆదివారంలాగా గడిచి పోయేది.

ఉత్సాహభరితమైన ప్రజానికం వేదిక వైపుకు తరలివస్తూ ఉంటే, ఆ మైదానంలో ఒకటి తరవాత ఒకటిగా బాంబులు పేలాయి.

శ్రీ నరేంద్ర మోడీ పాట్నా చేరుకునే సమయానికి, ఆయన దగ్గర రెండే మార్గాలున్నాయి-  ర్యాలీలో ప్రసంగించకుండా గుజరాత్ కు తిరిగివెళ్ళడం (అది ఆ పెద్ద వేదికకు మరింత భయం జోడించేది) లేదా ముందుకు సాగి ర్యాలీలో మాట్లాడటం.

శ్రీ మోడీ, ఆ ర్యాలీలో మాట్లాడడమే కాకుండా, ఒకరితో ఒకరు పోరాడడానికి బదులు పేదరిక నిర్మూలనకు, హిందువులు మరియు ముస్లింలు కలసి రావాలని ఒక అద్భుతమైన పిలుపునిచ్చారు. శాంతియుతంగా మరియు ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా సక్రమమైన పద్ధతిలో అక్కడనుండి నిష్క్రమించాలని పదే పదే ఆ ర్యాలిలో హాజరైన ప్రేక్షకులను ఆయన కోరారు.

తరువాత, శ్రీ మోడీ మాట్లాడిన వేదిక కింద కూడా ఒక బాంబు ఉందని తెలియవచ్చింది.

ర్యాలీ జరిగిన కొన్ని వారాల తర్వాత, “నా సంస్థాగత అనుభవం ప్రకారం ర్యాలీ వేదికలోకి వదులుగా వున్న ఒక జంతువు ప్రవేశించిందన్న పుకారు వస్తేనే చాలా గందరగోళం అవుతుంది, అలాంటిది, ఎవరైనా బాంబులు ఉన్నాయి అని ప్రకటిస్తేనో లేదా ర్యాలీలో నేను ప్రసంగించడం మానేస్తేనో ఏమి జరుగుతుందో ఊహించవచ్చు. అందుకు వేదిక వద్దకు వెళ్ళకూడదన్న ప్రసక్తే ఉండకూడదని  స్పష్టమైంది” అని శ్రీ మోదీ అన్నారు.

ఒక వారం తరువాత, బాంబు పేలుళ్ల కారణంగా సమీప మరియు ప్రియ బంధువులను కోల్పోయిన వారి కుటుంబాలను కలిసేందుకు శ్రీ మోదీ పాట్నాలో మరల వెళ్ళారు.

పాట్నా యొక్క హంకార్ ర్యాలీ ఒక మలుపు తిప్పిన జ్ఞాపకంగా నిలిచింది. ఈ సంఘటన, అత్యంత ప్రతికూల పరిస్థితులలో నిజమైన నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చిత్రీకరించింది. ఒకరితో ఒకరు పోరాడటం కాకుండా పేదరికంపై పోరాటం చెయ్యాలనే సందేశం  వంద కోట్ల భారతీయుల హృదయాలు మరియు మనస్సులలో ప్రతిధ్వనించింది.