లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తూ, గత మూడేళ్లుగా ఎన్డిఎ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం మరియు రైల్వేల్లో అపూర్వమైన పురోగతి సాధించిందని తెలిపారు. యుపిఎ హయాంలో కేవలం 10,83,000 ఇళ్ళు మాత్రమే నిర్మించగా, ఎన్డిఎ ప్రభుత్వం మూడేళ్ళలోనే 22, 27, 000 ఇళ్ళ నిర్మాణం జరిగిందని ప్రధాని తెలిపారు. రైల్వే నెట్వర్క్లో బ్రాడ్ గేజ్ యొక్క విస్తరణ పై మోదీ మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు.
Login or Register to add your comment