30 ఆగష్టు 2016న గుజరాత్లోని జామ్ జిల్లాలో ఒక కార్యక్రమంలో పాత్రికేయులు మరియు కెమెరామెన్ ల ప్రాణాలు కాపాడిన శ్రీ నరేంద్ర మోదీ యొక్క చురుకుదనం.
ఇది, గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో నీటి సమస్యలు తగ్గించడానికి సహాయపడేందుకు తలపెట్టిన ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టు అయిన సౌని యోజన ప్రారంభోత్సవం సందర్భంగా జరిగింది.
ముఖ్యమంత్రి విజయ్ రూపాని తో సహా ఇతర అధికారులతో కలిసి ప్రధానమంత్రి, అక్కడున్న ప్రదర్శనలు చూస్తూ, డ్యాం నుంచి నీటి ప్రవాహం మొదలయ్యేందుకు బటన్ నొక్కారు. అప్పటికింకా దిగువ ప్రాంతంలో కొంతమంది నిలుచి ఉండడం ప్రధాని మోదీ గమనించారు. ఎటువంటి ప్రమాదకర వాతావరణంలో వారు నిలుచున్నారో? ఆ కెమెరామెన్ అప్పటికి తెలియదు. సరిగా అప్పుడే ప్రధాని మోదీ లేచి చప్పట్లు కొడుతూ, అక్కడ నుండి తప్పుకోవాలని సైగ చేశారు. ఆ సైగలే, వారి అమూల్యమైన ప్రాణాలను సరైన సమయంలో రక్షించాయి.
అందులో వున్న కెమెరామన్ ఒకరు, ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి అతనికి కొత్త జీవితం యిచ్చారని అన్నారు.
అక్కడ శ్రీ మోదీ చూపిన చురుకుదనం పదే పదే ప్రశంసలు అందుకుంది.
ప్రధానమంత్రి 5 ఏప్రిల్ 2015 న విగ్యాన్ భవన్ లో ముఖ్యమంత్రులు మరియు ప్రధాన న్యాయమూర్తుల సమావేశానికి హాజరయినప్పుడు, ఒక ఫోటోగ్రాఫర్ పడిపోయారు. అప్పుడు అతనికి చేయూతనిచ్చిన వ్యక్తి మరెవరో కాదు శ్రీ నరేంద్ర మోదీ. ఈ వృత్తాంతం విస్తృతంగా ప్రజాదరణ పొందింది.