ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులను అలంకరించడానికన్నా పూర్వం శ్రీ నరేంద్ర మోదీ క్షేత్ర స్థాయిలో ఒక వినూత్న నిర్వాహకుడు. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయన సంస్థాగత కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వారు.
ఆయన వినూత్న కార్యనిర్వాహక నైపుణ్యాలు భారతీయ జనతా పార్టీకి ఎంత చక్కగా ఉపయోగపడ్డాయి అంటే- బిజెపి గుజరాత్ శాఖలో ఒక కీలక సభ్యునిగా 1980లో అహమ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికలలో ఆ పార్టీ విజయం సాధించడానికి దోహదం చేసేంతగా.
ఆయన సంస్థాగత విధానాలలో నవీకరణ రెండు విధాలుగా ఉంటుంది. ప్రతి కార్యకర్తను గుర్తించి, పనిని విభజించడమూ; అలాగే, విభజించిన ప్రతి పనిని ఒక కార్యకర్తకు అప్పచెప్పడమూ ఆయన ఆచరించే ఒకటో విధంగా ఉండేది. ఇక ప్రచారంతో భావావేశమైన సంబంధాన్ని కలిగివుండేటట్లు చూడడం రెండో విధంగా ఉండేది. ఆ నగరంతోనూ, దాని పరిపాలన పట్ల వారికి స్వంత భావం కలిగేటట్లు వారిని ఉత్సాహపరచి వారికి ప్రేరణను కలిగించే సామర్ధ్యం ఆయనకు ఉంది.
కార్యకర్తలను చిన్న చిన్న బృందాలుగా చేసి, వారు పౌరులతో మమేకం అయ్యే విధంగా అహమ్మదాబాద్ లో వెయ్యి కమ్యూనిటీ స్థాయి బృంద సమావేశాలను నిర్వహించడం ఆయన సామాజిక కార్యనిర్వహణలో ప్రధానమైంది. ఈ వెయ్యి సామాజిక స్థాయి సమావేశాలకు ముందు ఆయన వంద మంది కార్యకర్తలకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కమ్యూనిటీ స్థాయి బృంద సమావేశాలలో ఈ కార్యకర్తలు ఏమేమి చేయాలి ?, ఎటువంటి సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించాలి ?, ఎటువంటి వాదనలు చెయ్యాలి ? వంటి వాటిపై ఈ శిక్షణలో ప్రధానంగా దృష్టి పెట్టారు.
ఎన్నికల వ్యూహానికి సంబంధించి ఇది ఒక సరికొత్త, తీవ్రమైన చర్య.
ఈ కమ్యూనిటీ స్థాయి బృంద సమావేశాల్లో 25 నుండి 30 మంది వరకు పౌరులు ఉంటారు. అందులో ఉత్సాహవంతమైన వారిని, నగరానికి సంబంధించిన సమస్యలను స్పష్టంగా వివరించగలిగే వారిని మాట్లాడవలసిందిగా ప్రోత్సహిస్తారు. ఈ ప్రక్రియలో మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత మహిళా బృందాలతో సమావేశాలు ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం అటల్ బిహారీ వాజ్ పేయి గారిని ఒప్పించి తీసుకురావడంలో కూడా శ్రీ మోదీ కృతకృత్యులయ్యారు.
శ్రీ నరేంద్ర మోదీ క్షేత్ర స్థాయి కార్యనిర్వహణ విధానంలో చెప్పుకోదగిన ఎదో ఒక ప్రత్యేకత ఉంది. ఒక నిర్మాణాత్మకమైన కార్యకర్తల శిక్షణ, కార్యకర్తలను ఒక విధమైన స్థానిక భావోద్రేకంతో కూడగట్టడం అహమ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలలో బిజెపి గెలుపునకు పునాదిగా నిలచాయి. స్థానిక స్థాయిలో సూక్ష్మ పరిశీలనతో ఏర్పాటు చేసిన సంఘటన్ (సమావేశాలు), రాష్ట్ర స్థాయిలో శ్రీ నరేంద్ర మోదీ కార్యనిర్వహణకు ఎంతగానో తోడ్పడ్డాయి.
ఇదే విధానం గుజరాత్ లో ఎన్నికల తరువాత ఎన్నికలకు కూడా పునారావృత్తం అయింది. లోక్ సభ ఎన్నికలకు ప్రధాన కార్యదర్శి గా వ్యవహరించారు. చివరికి 2001 లో ఎన్నికల రాజకీయాలలో శ్రీ మోదీ పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలతో మమేకం కావడం, వారి అవసరాలను, ఆశలను అర్ధం చేసుకోవడంలో ఆయన సామర్ధ్యం నిజంగా ప్రయోజనకారి అయ్యింది.