భారతదేశంను మురికిరహితం చేసే లక్ష్యంతో ప్రారంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమం, కోట్లాది భారతీయుల జీవితాలను తాకింది.
మొదటిసారిగా, భారతదేశ ప్రధాన మంత్రి అంతటి వ్యక్తి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 15 ఆగష్టు 2014 న ఎర్రకోట భూరుజు మీదనుండి చేసిన ఉపన్యాసంలో శుభ్రత గురించి మాట్లాడారు. అదే సంవత్సరం అక్టోబర్ 2న ప్రధానమంత్రి వ్యక్తిగతంగా చీపురు చేతపట్టి స్వచ్ఛ భారత్ సృష్టించడానికి ప్రయత్నంలో ముందుండి నడిపించారు. ఆయన ప్రతీసారి శుభ్రత గురించి మాట్లాడడం ద్వారా బహిరంగ చర్చకు వచ్చేలా చేయగలిగారు. అది అధికారిక కార్యక్రమమైనా లేదా రాజకీయ ర్యాలీ అయినా పరిశుభ్రత అనే అంశం, క్రమం తప్పకుండా ప్రస్తావన వస్తుంది.
ఏ అనుమానం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, అసమాన ఓజస్సుతో స్వచ్ఛ భారత్ మిషన్ ను బలపరిచారు. ఈ ఉద్యమానికి మీడియా కూడా మద్దతుగా నిలిచింది.
చంద్రకాంత్ కులకర్ణి చర్యను, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధానమంత్రి వ్యాక్యలు దేశంపై ఎంత ప్రభావితం చేసిందో తెలిపే ఉదాహరణగా చూడవచ్చు.
చంద్రకాంత్ కులకర్ణి, నెలకు రూ. 16,000 నెలసరి పింఛను తీసుకునే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రేరణతో, దానికి నెలకు 5000 రూపాయిలు కంట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించుకుని, ఒక నెలకు మాత్రమే కాకుండా, రాబోయే 52 నెలలకు ప్రతీనెలా తేదీలతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు!
స్వచ్ఛమైన భారతదేశం కోసం ఒక పించనుదారుడు, తన జీతంలో దాదాపు ఒక మూడవ వంతు ఇస్తున్నారు. ఇది ప్రజల మనస్సుల్లో ప్రధాని మాటలు నమ్మకాన్ని సృష్టించారనడానికి మరియు దేశంను పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకెళ్ళేందుకు పౌరులు కూడా అంతర్భాగమని అనుకుంటున్నారని అనడానికి ఉదహరణలుగా నిలుస్తాయి. ‘పరిశుభ్ర భారత దేశం’ సృష్టించడానికి ప్రజలు ఎలా కలిసి పనిచేస్తున్నారో తెలియజేయడానికి తన వంతుగా శ్రీ మోదీ ఇటువంటి అనేక సంఘటనలను పంచుకున్నారు. తన ప్రతీ 'మాన్ కీ బాత్' కార్యక్రమంలో శుభ్రతను గూర్చిన ప్రస్తావన ఉంటుంది.
ప్రధాని శ్రీ మోడీ, శుభ్రత కోసం ఒక ప్రజా ఉద్యమం సృష్టించడంలో విజయం సాధించారు కాబట్టి, అది తప్పనిసరిగా భారతదేశాభివృద్ధికి ఎల్లప్పుడూ దోహదపడుతుంది.